కడప జిల్లాలో దారుణం.. శానిటైజర్ తాగి తల్లి, కుమారుడు మృతి

  • కడప జిల్లా చెన్నూరులో విషాదం
  • మత్తు కోసం శానిటైజర్ తాగిన వైనం
  • ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం
మద్యానికి బానిస అయిన తల్లి, కుమారుడు శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటన కడప జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది. స్థానిక ఎల్లమ్మగుడి వీధిలో ఉండే విజయలక్ష్మి, ఆమె కుమారుడు శ్రీరామ్ నాయక్ మత్తును కలిగించే శానిటైజర్లు తాగడానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో శానిటైజర్ తాగి వారిద్దరూ కుప్పకూలిపోయారు. పక్కన ఉన్నవారు సమాచారాన్ని పోలీసులకు అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వచ్చి, కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వారిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ మత్తుకోసం గంజాయి, ఆల్కహాల్, శానిటైజర్లు, వైటెనర్స్ వాడటం మానేయాలని సూచించారు.

sanitiser
mother

More Telugu News